తిరుపతిలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపోరాట సభ జరిగింది . ఈ సభకు అనేక మంది మంత్రులు,శాసనసభ్యులు,పార్లమెంట్ సభ్యులు,కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున,ఇదే సమయంలో ఇదే ప్రాంగణంలో అప్పటి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోదీ వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అందుకనే ఈ రోజు ఇదే ప్రాంగణంలో హామీలను గుర్తుచేయడానికి  ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో తేల్చుకోవలసిన సమయం వచ్చిందని వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు తప్పితే ఎవరికీ మంచిది కాదని, నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం చేస్తున్నామని ఇందులో అంతిమ విజయం తమదేనని,ఎవరూ ఆపలేరని చెప్పారు. ఈ సందర్భంగా ఆనాడు మోదీ ఇచ్చిన హామీల వీడియోను ప్రదర్శించారు. ఆనాడు రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైనప్పుడు ప్రధాన మంత్రి రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని,ప్రత్యేక హోదా కలిపిస్తామని అన్నారని కాని కేవలం 1500 కోట్లు మాత్రమే నిధులు ఇచ్చారని,తన కష్టార్జితంతోనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నానన్నారు. హేతుబద్దత లేని విధంగా ఆనాడు కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందని,పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించినా కూడా ఇవ్వకపోవడం బాధాకరం అని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయను అన్నందునే 7 ముంపు మండలాలను కలిపారనన్నారు. తరువాత ప్రత్యేక హోదా కుదరదని, దానికి సమానంగా ప్రత్యేక ప్యాకేజి ప్రకటించి జీఓ కూడా ఇవ్వలేదన్నారు. తన రాజకీయ జీవితం ఎస్ వీ యూనివర్సిటీ లోనే ప్రారంభమయ్యిందని ఇక్కడ ఏ చేట్టునదిగినా, ఏ పుట్టనడిగినా తన కధ చెప్తాయన్నారు.రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటుపడిన పార్టీ కేవలం టీడీపీ అని అన్నారు. 10 రాష్త్రాలకు హోదా ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు హోదా ఇవ్వలేదన్నారు. మొదటి సంవత్సరం 16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉంటే 4 వేల కోట్లు ఇచ్చి పనైపోయిందనే పరిస్తితికి వచ్చారన్నారు.పోలవరం ప్రాజెక్టి కచ్చితం పూర్తి చేస్తామని,కొందరు కావాలని ఆరోపణలు చేస్తూ ప్రాజెక్ట్ కు అడ్డుపదేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.హైదరాబాద్ లోని మూడో నగరమైన సైబరబాద్ ను తానే నిర్మించానని చెప్పారు. గుజరాత్ లో మంచి నగరాలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు నగరాలు అవసరంలేదా అని ప్రశ్నించారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు నిధులు ఇవ్వడం లేదన్నారు . కడప స్టీల్ ఫాక్టరీకు,విశాఖ రైల్వే జోన్ కూడా ఇవ్వడం లేదని ఇది నమ్మక ద్రోహం కాదా అని ప్రశ్నించారు? . వైసిపీ,బీజేపీ లాలూచి పడ్డాయనారు. ఆనాడు వైసిపీ,కాంగ్రెస్ లాలూచి పడి రాష్ట్రవిభజన చేశాయన్నారు…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments