భారత ఓపెనర్‌, డబుల్‌ సెంచరీల వీరుడు, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ రోజు(ఏప్రిల్‌ 30) 31వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, సీనియర్లు, అభిమానుల నుంచి రోహిత్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌.. రోహిత్‌ నా ఫేవరెట్‌ బ్యాట్స్‌మెన్‌. అతడి ఆటను నేను ఆస్వాదిస్తాను. నువ్వు ఇలాగే నీ ప్రతిభను పెంపొందించుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని గడపాలంటూ ట్వీట్‌ చేశాడు. ‘క్రికెట్‌ ఆడటాన్ని ఆస్వాదించే రోహిత్‌ పేరులోనే హిట్‌ ఉంది. ఈ సంవత్సరమంతా నీకు సూపర్‌గా ఉండాలి. పుట్టిన రోజు శుభాకాంక్షలు రోహిత్‌’ అంటూ టీమిండియా ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా అభినందనలు తెలిపారు.

‘మా కెప్టెన్‌ ఈ ఏడాదంతా పరుగుల వరద పారించాలి. సెంచరీలు, సిక్స్‌లు.. ఇంకా ఎన్నెన్నో విజయాలు సాధించాలి. పుట్టిన రోజు శుభాకాంక్షలు రోహిత్‌ శర్మ’ అంటూ ముంబై ఇండియన్స్‌ టీమ్‌ ట్వీట్‌ చేసింది. ‘మూడు వన్డే డబుల్‌ సెంచరీలు.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత  స్కోరు (264).. ఫాస్టెస్ట్‌ టీ20 సెంచరీ.. హ్యాపీ బర్త్‌డే రోహిత్‌ శర్మ’ అంటూ ఐసీసీ అభినందనలు తెలిపింది.

హిట్‌మ్యాన్‌ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే రోహిత్‌ శర్మ.. పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. క్రికెట్‌ చరిత్రలో వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) చేసిన ఘనత కూడా ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కే దక్కింది. టెస్ట్‌, వన్డే, టీ20 ఇలా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా రోహిత్‌ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్‌ శర్మ రెండుసార్లు జట్టును విజేతగా నిలపడంలో తన వంతు కృషి చేశాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments