ధర్మపోరాట సభ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కృష్ణుడిగా, నారదుడిగా, విశ్వామిత్రుడిగా రకరకాల వేషధారణలో తెలుగువారి ఆవేదనను తెలియజేసేందుకు ప్రయత్నించానని.. అయినా పట్టించుకోలేదని విమర్శించారు. అజాతశత్రువు లాంటి చంద్రబాబు నాయుడు అలిగితే దేశమంతా ఒక్కటవుతుందని హెచ్చరించారు. తెలుగు ప్రజలను తక్కువ చేయొద్దని అన్నారు. ఎన్టీఆర్‌ని పదవి నుంచి దించేస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు. వింటే ఉంటావు మోదీ.. వినకుంటే పోతావు మూడి అంటూ తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసిరారు. అష్టకష్టాలు పడతావంటూ విశ్వామిత్ర మహర్షిలా శాపనార్థాలు పెట్టారు. అయినా మోదీకి ఏమీ వినపడట్లేదని.. వినపడేలా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Subscribe
Login
0 Comments