సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలపై బాలీవుడ్ బ్యూటీ, వివాదాస్పద నటి రాఖీ సావంత్ స్పందించారు.  చలన చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఆమె తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తానుకూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినని చెబుతూనే…ప్రస్తుత పరిస్థితుల్లో యువతులు  అవకాశాల కోసం  ఏదైనా  చేయడానికి  సిద్ధంగా ఉన్నారు… ఇందుకు ప్రొడ్యూసర్లను ఎందుకు తప్పుపడతారని ప్రశ్నించింది.  మరోవైపు చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ అత్యాచారం చేయరనీ,  స్వచ్ఛందంగా పరస్పర అంగీకారంతోనే  ఇది ముడిపడి ఉంటుందని తెలిపింది.  అంతేకాదు ఈ విషయంలో  బాలీవుడ్‌  ప్రముఖ కొరియో గ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ ఇటీవలి వ్యాఖ్యలకు వత్తాసు పలికింది. బాలీవుడ్‌ను అగౌరవ పర్చడం  తన ఉద్దేశం కాదనీ, సరోజ్‌ఖాన్‌కు మద్దతుగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని స్పష్టం చేసింది.

ఏమైనా చేయండి.. కానీ తమకు అవకాశాలు ఇవ్వండి  అనే ధోరణిలో   నేటి తరం యువతులు వున్నారంటూ రాఖీ  వ్యాఖ్యానించింది.  హీరోయిన్స్‌ కావాలని  పరిశ్రమకు వచ్చిన చాలామంది అమ్మాయిలు మరేదో అవుతున్నారని పేర్కొంది. అమ్మాయిలు  కెరియర్‌ కోసం రాజీ పడుతున్నారని తెలిపింది.  ఈ సందర్భంగా  పనిలో పనిగా బాలీవుడ్‌ జనాలపై విమర్శలు గుప్పించింది.  తమ కళ్లముందే లైంగిక వేధింపులు జరుగుతున్నా బయటి ప్రపంచానికి నిజాలను వెల్లడించరని పేర్కొంది. ఈ విషయంలో నిర్భయంగా మనసులోమాట చెప్పి ప్రపంచానికి సత్యాన్ని తెలియచేసిన సరోజ్‌ ఖాన్‌ అభిప్రాయంతో తాను  పూర్తిగా ఏకీ భవిస్తున్నానని చెప్పింది.

ఇండస్ట్రీలో నిలదొక్కుకునే సమయంలో తాను కూడా క్యాస్టింగ్  కౌచ్‌ ఎదుర్కొన్నాననీ,  కానీ ప్రతి నిర్మాత, దర్శకుడు  తన పట్ల అలా ప్రవర్తించ లేదని పేర్కొంది.  చిత్ర పరిశ్రమలో లైంగిక అవినీతి ఉంది. ఇది ఆందోళన కలిగించింది. అయితే  ఇది మొదట్లోనే. ఆ తరువాత  ప్రతిభతో వీటన్నింటిని అధిగమించానని  చెప్పుకొచ్చింది. మరోవైపు ఈ ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో లైంగిక రాజీలకు సంబంధించి యువకులకు ఎలాంటి మినహాయింపు లేదని పేర్కొంది. అయితే సల్మాన్‌ ఖాన్‌, ప్రియాంక  చోప్రా ప్రతిభతో రాణించి సూపర్‌స్టార్‌గా  అవతరించారు.  విజయానికి ఎలాంటి ష్టార్‌కట్‌లు వుండవంటూ హితవు పలికింది.  అవకాశాలకోసం రాజీ పడకండి.. టాలెంట్‌ నమ్ముకోండి..ఎలాంటి  ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగొద్దంటూ బాధితులకు  ఈ సందర్భంగా  సలహా ఇవ్వడం విశేషం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments