• కరుణాకరన్ మూవీలో తేజు
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్
  • రేపు ఉదయం టీజర్ రిలీజ్

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో ఒక ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకి ‘తేజ్ ఐ లవ్ యు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి మే 1వ తేదీన ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. తాజాగా టైమ్ ను కూడా ఫిక్స్ చేసి, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.

రేపు ఉదయం 11:30 గంటలకు టీజర్ ను వదలనున్నారు. యూత్ ను ఆకట్టుకునేలా ఈ టీజర్ ను కరుణాకరన్ కట్ చేసినట్టుగా చెబుతున్నారు. సాయిధరమ్ తేజ్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ న్యూ లుక్ తో కనిపించనున్నాడు. వరుస పరాజయాలతో వున్న సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమా ఊరటనిస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments