• ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డుకు ద్రావిడ్ ను నామినేట్ చేసిన బీసీసీఐ
  • రాహుల్ ను ప్రతిపాదించడాన్ని తప్పు పడుతున్న బీసీసీఐలోని ఓ వర్గం
  • అవార్డును అందుకునేంత అనుభవం రాహుల్ కు ఇంకా రాలేదని వాదన

క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డుల్లో ఒకటైన ద్రోణాచార్య అవార్డుకు టీమిండియా అండర్-19, ఏ-టీమ్ కోచ్ అయన మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను బీసీసీఐ నామినేట్ చేయడం వివాదాస్పదంగా మారింది. రాహుల్ పేరును ప్రతిపాదించడంపై బీసీసీఐలోనే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ద్రావిడ్ ను నామినేట్ చేయడమంటే… క్రికెటర్లను చిన్న వయసులోనే గుర్తించి, వారిని సాన పట్టిన గురువులకు అన్యాయం చేయడమేనని కొందరు వాదిస్తున్నారు.

భారత క్రికెట్ కోసం రాహుల్ ద్రావిడ్ చేసిన సేవలు వెలకట్టలేనివని చెప్పడంలో వాస్తవం ఉందని… అయితే, కోచ్ గా అతని అనుభవం కేవలం మూడేళ్లు మాత్రమే అని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డును అందుకునే అర్హత ద్రావిడ్ కు ఇంకా రాలేదని బీసీసీఐకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments