సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగు సంవత్సరాల క్రితం నోవేటల్ వేదికగా జనసేన పార్టీ ప్రకటించిన విషయం తెలిసినదే.2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించి విజయానికి తోడ్పడ్డారు.కాగా ఇటీవల జరిగిన గుంటూరు సభలో ఎవరూ ఊహించని విధంగా తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.దాని తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.తాజాగా  జనసేన స్పోక్స్ పర్సన్ అద్దేపల్లి శ్రీధర్ మాట్లాడుతూ జనసేన మొత్తం 175 స్థానాలలో పోటీ చేయటానికి సిద్ధంగా ఉందని,వార్డు నెంబర్ ఎన్నికలతో సహా అన్నింటిలో తలపడనున్నట్లు తెలిపారు. పార్టీ పెట్టి నాలుగేళ్ళు అయినా పవన్ కళ్యాణ్ ఎటువంటి కార్యాచరణ ప్రకటించలేదు,ఎన్నికలకు ఒక సంవత్సరం కూడా సమయం లేని తరుణంలో జనసేన ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments