14 యేళ్ల తరువాత దిల్ రాజు తో నితిన్

617

ప్రస్తుతం నితిన్ .. దిల్ రాజు నిర్మాణంలో ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా చేస్తున్నాడు. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, పంజాబ్ – పాటియాలలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధానమైన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా నటిస్తోంది. జూలై 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
కెరియర్ తొలినాళ్లలో నితిన్ ‘దిల్’ సినిమా చేశాడు. ‘దిల్’ను నిర్మించిన కారణంగానే అది ఆ నిర్మాత ఇంటిపేరుగా మారిపోయింది. మళ్లీ ఇంతకాలానికి ‘దిల్’ రాజు నిర్మాణంలో నితిన్ ఈ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు ఇంతకుముందు సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ‘శతమానం భవతి’ భారీ విజయాన్ని అందుకుంది. అందువలన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here