150 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ‘భరత్ అనే నేను’

1034
  • భరత్ అనే నేను’కు భారీ వసూళ్లు
  • ఓవర్సీస్ లోను ఎంతమాత్రం తగ్గడం లేదు
  • అన్నీ అంశాలు కలిసిరావడమే కారణం

మహేశ్ బాబు హీరోగా ఈ నెల 20వ తేదీన ‘భరత్ అనే నేను’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూత్ తో పాటు మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పించింది. దాంతో తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.
ఇక వారం రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 73.9 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందనేది తాజా సమాచారం. అమెరికాలో 3 మిలియన్ డాలర్లకి పైగా రాబట్టిన ఈ సినిమా, ఆస్ట్రేలియా . . న్యూజిలాండ్ లోను భారీ వసూళ్లను రాబడుతున్నట్టుగా చెబుతున్నారు. కొరటాల శివ స్క్రీన్ ప్లే .. మహేశ్ బాబును ఆయన చూపించిన విధానం .. మహేశ్ నటన .. కైరా అద్వాని గ్లామర్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు వచ్చేలా చేయడంలో ప్రధానమైన పాత్రను పోషించాయని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here