• సిద్ధరామయ్య ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయింది
  • బాదామిలో కూడా ఆయన ఓడిపోతారు
  • కర్ణాటకను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. వరుసగా 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలయిందని… కర్ణాటకలో కూడా అదే కంటిన్యూ అవబోతోందని చెప్పారు. బాలకోట్ లోని హుంగుంఢ్ నియోజకవర్గంలో ప్రసంగిస్తూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని అమిత్ చెప్పారు. సిద్ధరామయ్యపై కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుందని… బాదామిలో కూడా ఆయనతో బలవంతంగా పోటీ చేయిస్తోందని… అక్కడ కూడా ఆయన ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఎడ్యూరప్పకు అధికారం కట్టబెడితే కర్ణాటకను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కర్ణాటక అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments