స్పీడు పెంచిన త్రివిక్రమ్‌

1379

07-1428379726-son-of-satyamurthy-audio-success-meet-7

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డేహీరోయిన్‌ గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన షెడ్యూల్‌లో యాక్షన్‌ సీన్స్‌ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. త్రివిక్రమ్‌ సినిమాలను చాలా నెమ్మదిగా తీస్తాడన్న అపవాదు ఉంది. ప్రతీ సినిమాకు కనీసం ఏడాదిపైనే వర్క్‌ చేస్తాడు.

కానీ ఎన్టీఆర్‌ సినిమా విషయంలో అలా కుదరదు. ఎన్టీఆర్‌ అక్టోబర్‌ నుంచి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ లోగానే త్రివిక్రమ్‌ సినిమా పనులన్ని పూర్తి చేయాలి. అందుకు తగ్గట్టుగా తన రెగ్యులర్‌ స్టైల్‌ను పక్కన పెట్టి వేగంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్‌. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాను రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ను వేగంగా పూర్తి చేయటం చూస్తుంటే అనుకున్న సమయానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే లాగే ఉన్నారు చిత్రయూనిట్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here