• క్రితం ఏడాది ‘బాహుబలి 2’ వచ్చింది ఈ రోజునే
  • నా కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైంది
  • నాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది

ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ‘అబుదాబి’లో ప్రభాస్ తదితరులపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. క్రితం ఏడాది ఇదే రోజున ‘బాహబలి 2’ సినిమా భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటూ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ విషయం గుర్తొచ్చి తాను అనిర్వచనీయమైన అనుభూతికి లోనైనట్టు ప్రభాస్ చెప్పాడు.
“ఈ సినిమా సంచలన విజయం సాధించి నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానులను సంపాదించి పెట్టడమే కాకుండా, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు బొమ్మ ఏర్పాటయ్యేలా చేసింది. అలాంటి ‘బాహుబలి’ నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనదే. నాకు ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు రావడానికి కారకులైన రాజమౌళి గారికీ .. అందుకు సహకరించిన మిత్రులకు నా కృతజ్ఞతలు” అంటూ ప్రభాస్ తన మనసులో మాట చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments