మే 10 నుంచి 17 వరకు ప్రతి గ్రామంలో రైతు బంధు పండుగ జరుగుతుందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు గ్రామాలకు వచ్చి పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేస్తారని చెప్పారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో రైతు బంధు పథకం కింద రూ.194 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. రూ.50 వేలు దాటితే రెండు చెక్కులు, రూ.లక్ష దాటితే 3 చెక్కులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షల ప్రమాద బీమా చెల్లిస్తామని హరీష్‌రావు ప్రకటించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments