• కరుణాకరన్ దర్శకత్వంలో తేజు
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్
  • విభిన్నమైన ప్రేమకథా నేపథ్యం

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణను జరుపుకుంది. యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథగా కరుణాకరన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్ ను పరిశీలించారు. అవి తేజుకి నచ్చకపోవడం .. మంచి ఫీడ్ బ్యాక్ కూడా రాకపోవడంతో ఆ టైటిల్స్ ను పక్కన పెట్టేశారు. తాజాగా ‘తేజ్ ఐ లవ్ యు’ అనే టైటిల్ ను ఖరారు చేసి .. ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. తేజ్ .. అనుపమ వైపు సూటిగా చూస్తుంటే, ఆమె కాస్త సిగ్గుపడుతున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి మే 1వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments