• ‘నేల టిక్కెట్టు’తో రానున్న రవితేజ
  • శ్రీను వైట్లతో నెక్స్ట్ మూవీ
  • ఆ తరువాత సినిమా సంతోష్ శ్రీనివాస్ తో

రవితేజ త్వరలో ‘నేల టిక్కెట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకు చిత్రీకరణ జరుపుకుంది. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. జూలై నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
తమిళంలో హిట్ కొట్టిన ‘తెరి’ మూవీని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. గతంలో రవితేజ సరసన కాజల్ చేసిన ‘వీర’ .. ‘సారొచ్చారు’ సరిగ్గా ఆడలేదు. అందువలన ఈ సినిమా చేయడానికి కాజల్ ఆసక్తిని చూపలేదట. కానీ ఆ తరువాత ఆమెను ఒప్పించారనేది తాజా సమాచారం. ఈ సారి ఈ జంట హిట్ కొడుతుందేమో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments