• నాగ్ హీరోగా ‘ఆఫీసర్’
  • కథానాయికగా మైరా సరీన్
  • వచ్చేనెలలో విడుదల

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఆఫీసర్’ సినిమా రూపొందుతోంది. ముంబై మాఫియా నేపథ్యంలో కొనసాగే కథ ఇది. ఈ సినిమాలో కథానాయికగా మైరా సరీన్ నటిస్తోంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా ఇదే. ఈ రోజుతో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది.
వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో ముంబై వెళతాడు. అక్కడ అతనికి ఎదురయ్యే పరిస్థితులు ఎలాంటివి? వాటిని ఆయన ఎలా అధిగమించాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందట. ఇది ‘శివ’ సినిమాను మించి ఉంటుందని వర్మ చెప్పడం వలన, ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments