మృగాళ్లు అత్యాచారానికి ప్రయత్నిస్తే బాధితులకు అందుబాటులో ఏది దొరికితే దాంతో చంపేయాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పిలుపునిచ్చారు. కాలం చెల్లిన చట్టాలను మార్చారా? అని ప్రశ్నించారు. మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురి కావాల్సిందేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల మాదిరిగా భారత్లో కూడా బహిరంగంగా ఉరితీయాలన్నారు. మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా ఉండి తాను ఏమీ చేయలేక పోతున్నానని నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఒప్పిచర్లలో మహిళపై అత్యాచార ఘటన దారుణమన్నారు. ఢిల్లీలో నిర్భయ ఘటన తరహాలో అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. అత్యాచార ఘటనల్లో తీర్పులు త్వరగా వచ్చి.. మరణ శిక్ష వేయాలని నన్నపనేని కోరారు.
భారత్లో కూడా బహిరంగంగా ఉరితీయాలి: నన్నపనేని
Subscribe
Login
0 Comments