• భారత్‌లో 2 వేలకు పైగా థియేటర్లలో నిన్న విడుదల
  • రూ.31.30 కోట్ల నెట్‌
  • రెండవ స్థానంలో రూ.25.10 కోట్లతో ‘బాఘి 2’

భారత్‌లో గతంలో ఏ హాలీవుడ్ సినిమా విడుదలకానంతగా నిన్న 2 వేలకు పైగా థియేటర్లలో ‘అవెంజర్స్-ఇన్ఫినిటీ వార్’ విడుదలైన విషయం తెలిసిందే. భారతీయులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఏడాది ఏ బాలీవుడ్ సినిమా కూడా సాధించలేని విధంగా ఈ సినిమాకు తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టింది. భారత్‌లో ఈ సినిమా తొలిరోజున అన్ని భాషల్లో కలిపి రూ.31.30 కోట్ల నెట్‌ రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్‌ చెప్పారు. ఈ ఏడాది భారత్‌లో ‘అవెంజర్స్‌ ఇన్ఫినిటీవార్‌’ తరువాత తొలిరోజున అత్యధిక నెట్‌ రాబట్టిన సినిమాలుగా ‘బాఘి 2’ (రూ.25.10 కోట్లు), ‘పద్మావత్’  (రూ.19 కోట్లు), ‘ప్యాడ్‌మ్యాన్‌’ (రూ.10.26 కోట్లు), ‘రెయిడ్‌’ (రూ.10.04 కోట్లు) నిలిచాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments