• తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మీ
  • మాట్లాడించడానికి వెంటపడ్డ మీడియా
  • జోకులు వేస్తూ వెళ్లిపోయిన హాస్యనటుడు

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనతో మాట్లాడించడానికి మీడియా ప్రయత్నించగా అందుకు ఒప్పుకోలేదు. బ్రహ్మానందం నడుచుకుంటూ వెళుతుండగా విలేకరులు ఫొటోలు, వీడియోలు తీయడం కోసం ఆయన వైపునకు కెమెరాలు పెట్టి వెనక్కి నడూస్తూ వెళ్లారు. దీంతో బ్రహ్మానందం వారితో ‘ఇలా వెనక్కు వెనక్కు నడవడమే మీకు అలవాటైపోతుంది’ అని చమత్కరించారు.
కొందరు విలేకరులు టాలీవుడ్‌లో చెలరేగుతోన్న వివాదాలపై స్పందించాలని బ్రహ్మీని అడిగారు. ఫిలిం ఛాంబర్‌లో పవన్ కల్యాణ్ నిరసన తెలపడం, శ్రీ రెడ్డి పలువురిపై ఆరోపణలు చేయడం వంటి అంశాలపై ఆయనను ప్రశ్నలు అడిగారు. కానీ, బ్రహ్మానందం జోకులు వేస్తూ ముందుకు వెళ్లారు. కాగా, బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన ఆచారీ అమెరికా యాత్ర సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments