నాకు రాజకీయాలు తెలియవు -అరవిందస్వామి

0
177

Arvind_Swamy

నాకు రాజకీయాలు తెలియవు. కాబట్టి రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశమే లేదు అన్నారు నటుడు అరవిందస్వామి. ఈయన రీఎంట్రీ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం భాస్కర్‌ ఒరు రాస్కెల్‌. నటి అమలాపాల్‌ నాయకిగా నటించిన ఈ చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించిన భాస్కర్‌ ది రాస్కెల్‌ చిత్రానికి రీమేక్‌. నాజర్, సూరి, రోబోశంకర్, రమేశ్‌ఖన్నా, సిద్ధిక్, మాస్టర్‌ రాఘవ్, బేబీ నైనిక ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు సిద్ధిక్‌నే దర్శకత్వం వహించారు. చిత్రం మే 11న విడుదలకు సిద్ధం అవుతోంది. గురువారం చెన్నైలో చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో అరవిందస్వామి మాట్లాడుతూ ఇది మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రానికి రీమేక్‌ అని చెప్పారు.

అయితే తమిళం కోసం కొన్ని మార్పులు చేసి రూపొందించినట్లు తెలిపారు. భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ పూర్తిగా కమర్షియల్‌ ఎంటర్‌టెయినర్‌ చిత్రంగా ఉంటుందన్నారు. తాను వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నానని, తనీ ఒరువన్‌ చిత్రంలో విలన్‌గా నటించడంతో అదే తరహా చిత్రంల్లో నటించే అవకాశాలు 15కు పైగా వచ్చినా అంగీకరించలేదని అన్నారు. హీరోగానైనా, విలన్‌గానైనా మంచి పాత్ర అయితే కచ్చితంగా నటిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తారా? అని అడుగుతున్నారని, తనకు రాజకీయాలు తెలియవని, అందువల్ల అలాంటి అవకాశం లేదని పేర్కొన్నారు. హర్షిణి మూవీస్‌ పతాకంపై హర్షిణి నిర్మించిన ఈ చిత్రానికి అమ్రేశ్‌ గణేశ్‌ సంగీతాన్ని, విజయ్‌ ఉలగనా«థ్‌ ఛాయాగ్రహణం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here