• అనంతపురంలోని గుంతకల్లులో సమావేశం
  • జనసేన నేతలను నిలదీసిన పవన్‌ అభిమానులు
  • కుర్చీలు విరగ్గొట్టిన వైనం

అనంతపురంలోని గుంతకల్లులో ఈ రోజు జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించింది. అయితే, ఈ సందర్భంగా కొందరు పవన్‌ కల్యాణ్ అభిమానులు ఒక్కసారిగా సమావేశంలోకి దూసుకువచ్చి రచ్చ రచ్చ చేశారు. జనసేన నేతలు సమావేశంలో మాట్లాడుతుండగా వచ్చి సమావేశాన్ని అడ్డుకున్నారు. తమను ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని నిలదీశారు. దీంతో గొడవ చెలరేగడంతో అక్కడ ఉన్న కుర్చీలు, ఫర్నిచర్‌ను పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments