• వైసీపీతో బీజేపీ కలవాలని చూస్తోందని సీఎం అంటున్నారు
  • ఎన్నికల వ్యూహంపై ఇప్పటివరకూ చర్చ జరగలేదు
  • అథవాలే వ్యాఖ్యలు బీజేపీ అభిప్రాయం కాదు
  • కాంగ్రెస్‌కు దగ్గర కావాలని చంద్రబాబు చూస్తున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీతో బీజేపీ కలవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారని, ఆయన అంతగా ఎందుకు భయపడుతున్నారో తనకు తెలియట్లేదని బీజేపీ ఏంపీ హరిబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల వ్యూహంపై బీజేపీలో ఇప్పటివరకూ చర్చ జరగలేదని, తాము ప్రస్తుతం తమ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టామని చెప్పారు.
ఇటీవల కేంద్ర సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే విజయవాడలో చేసిన వ్యాఖ్యలు బీజేపీ అభిప్రాయం కాదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని హరిబాబు అన్నారు. కాంగ్రెస్‌కు దగ్గర కావాలని చంద్రబాబు చూస్తున్నారని హరిబాబు ఆరోపించారు. కాగా, పోలవరం తెలుగు ప్రజలకు నరేంద్ర మోదీ ఇచ్చిన వరమని ఆయన చెప్పుకొచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments