ఎన్టీఆర్ బయోపిక్ పై వైరల్ అవుతోన్న కొత్త పుకారు!

1406
  • ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న తేజ
  • తెరపైకి పలువురు దర్శకుల పేర్లు
  • బాలయ్యే దర్శకత్వం వహించనున్నారంటూ కొత్త పుకారు

మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తాను నిర్మాతగా ఉంటూ… దర్శకత్వ బాధ్యతలను తేజకు అప్పగించారు. మరి కొన్ని రోజుల్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది అనుకుంటుండగా… దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకున్నారు. దీంతో, ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారు? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, వైవీయస్ చౌదరి, క్రిష్ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఇప్పుడు కొత్త పుకారు ఒకటి వైరల్ అవుతోంది. బాలయ్యే ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారనేదే ఆ పుకారు. ఈ వార్త ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.
ఈ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుందని బాలయ్య ఆలోచిస్తున్నారట. మెగా ఫోన్ పట్టుకోవాలని గతంలోనే బాలయ్య భావించారు. ‘నర్తనశాల’ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే, ఆ సినిమాలో ద్రౌపదిగా అనుకున్న సౌందర్య చనిపోవడంతో… ఆ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు ‘ఎన్టీఆర్’ చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని బాలయ్య అనుకుంటున్నారన్న వార్తలో ఎంత వరకు నిజం ఉందో రానున్న రోజుల్లో తేలిపోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here