• విడుదలకి ముస్తాబవుతోన్న ‘నా పేరు సూర్య’
  • దేశభక్తి నేపథ్యంలో కొనసాగే కథ
  • లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యత

వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ .. బన్నీ ‘నా పేరు సూర్య’ చేశాడు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను మే 4వ తేదీన విడుదల చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ప్రధానమైన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ, లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ‘నాకు కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి .. మంత్రాలు రావు’ అంటూ హీరో కోపంతో చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ‘క్యారెక్టర్ వదిలేయడమంటే .. ప్రాణాలు వదిలేయడమే .. చావు రాకముందు చచ్చిపోవడమే’ అంటూ హీరో ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ఈ ట్రైలర్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేస్తుందనే చెప్పాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments