• అల్లు శిరీశ్ హీరోగా ‘ఏబీసీడీ’
  • దర్శకుడిగా సంజీవ్ రెడ్డి
  • ఈ నెల 30వ తేదీన లాంచ్

‘ఒక్క క్షణం’ సినిమా తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుందని అల్లు శిరీష్ అనుకున్నాడు. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. దాంతో మంచి కథను ఎంపిక చేసుకోవడానికి శిరీష్ చాలా సమయమే తీసుకున్నాడు. ఫైనల్ గా మలయాళ మూవీ ‘ఏబీసీడీ’ రీమేక్ లో చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన లాంచ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగును జరపనున్నారు. మధుర శ్రీధర్ .. యష్ రంగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన ఈ సినిమా, అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దుల్కర్ క్రేజ్ ను అమాంతంగా పెంచేసింది. మరి తెలుగులో ఈ సినిమా శిరీష్ కి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments