పవన్ తో మళ్ళీ చేయాలని ఉంది..

దర్శకుడు హరీష్ శంకర్ కు పరిచయం అక్కర్లేని పేరు. పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్టైంది. ఒరిజినల్ సినిమాను పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా, పవన్ ఇమేజ్ కు తగిన విధంగా డిజైన్ చేసి సినిమాను తెరకెక్కించారు. రిలీజైన తరువాత సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

తరువాత డీజే పర్వాలేదనిపించారు. ఈ సినిమాతోనే పూజాకు లైఫ్ వచ్చింది. ఇప్పుడు వరుణ్ తో జిగర్తాండ సినిమాను వాల్మీకిగా రీమేక్ చేస్తున్నారు. వరుణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా పాత్రను డిజైన్ చేశారట. ఇందులో శోభన్ బాబు సినిమాలోని సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారు. సినిమా రిలీ కాబోతున్న సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశారు.

పవన్ తో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, గబ్బర్ సింగ్ 3 చేయాలనీ ఉందని అన్నారు. అలానే, ఎన్టీఆర్ తో చేసిన సినిమా ఫెయిల్ అయ్యిందని, తప్పకుండా మరో హిట్ సినిమా చేస్తానని హరీష్ శంకర్ పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here