సౌండ్ లేని రాజ్ దూత్ !

రేపు విడుదల కాబోతున్న చిన్న సినిమాలలో ఒక్క ‘దొరసాని’ ‘నిను వీడని నీడను నేనే’ సినిమాలకు తప్ప మిగతా మరే చిన్న సినిమాలకు అసలు ప్రమోషన్ కనిపించడం లేదు. ముఖ్యంగా శ్రీహరి కొడుకు మేఘాంష్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘రాజ్ దూత్’ మూవీ విడుదల అవుతోంది అన్న విషయం కూడ సగటు ప్రేక్షకుడుకి చేరలేదు అన్న వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి మేఘాంశ్ శ్రీహరి కొడుకు అన్న విషయం సగటు ప్రేక్షకుడుకి చేరవేయడంలో ఈమూవీ నిర్మాతలు ఫెయిల్ అయ్యారు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు శ్రీహరితో నటించిన ఎంతోమంది సెలెబ్రెటీలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది ఉన్నా కనీసం మేఘాంష్ కు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఇప్పటి వరకు కనీసం ట్విట్స్ కూడ పెట్టకపోవడం చూసి చాల మంది ఆశ్చర్యపోతున్నారు.
రాజశేఖర్ జీవిత దంపతులు తమ కూతురు శివాత్మిక ను ప్రమోట్ చేసే విషయంలో చూపించిన చొరవ శ్రీహరి కుటుంబ సభ్యుల నుండి మేఘాంష్ విషయంలో లభించక పోవడం కొంతవరకు లోటుగా మారుతుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈవిషయాలు ‘రాజ్ దూత్’ మూవీ నిర్మాతలు పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు.
రేపు ఏకంగా నాలుగు చిన్న సినిమాలు విడుదల అవుతున్న పరిస్థుతులలో ఇన్ని చిన్న సినిమాల మధ్య కనీసం ‘రాజ్ దూత్’ మూవీకి ఓపెనింగ్ కలక్షన్స్ అయినా వస్తాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమధ్య కాలంలో సినిమా వారసుల ఫిలిం ఎంట్రీ మేఘాంష్ విషయంలో జరిగినట్లుగా మరే వారసుడుకి అంత డల్ గా జరగలేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో శ్రీహరి వారసుడు ఇంత తీవ్ర పోటీని తట్టుకుని నిలబడతాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here