వైభవంగా దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడి పెళ్ళి

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. తన బీట్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు దేవిశ్రీ. ఇప్పటికే ఎన్నో మ్యూజికల్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న దేవి ఇంకా స్టార్ హీరోల సినిమాలకు సంగీత సారథ్యం వహిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో ఎలిజిబుల్ బ్యాచిలర్లలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఒకడు. ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న దేవిశ్రీ ఇప్పటికీ బ్రహ్మచారే. అయితే, దేవిశ్రీ తమ్ముడు సాగర్ కు మాత్రం పెళ్లయిపోయింది. ఈ విషయాన్ని దేవిశ్రీనే స్వయంగా వెల్లడించాడు. అది కూడా ఎంతో ఆలస్యంగా చెప్పాడు. గత నెల 19న తన సోదరుడు సాగర్ వివాహం మౌనిక అనే అమ్మాయితో జరిగిందని, ట్వీట్ చేశాడు.
జూన్ 19న తన తల్లిదండ్రుల పెళ్లిరోజు కూడా కావడం విశేషమని డీఎస్పీ తెలిపాడు. ఈ పెళ్లిలో తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరైనట్టు వెల్లడించాడు. అయితే ప్రస్తుతం దేవిశ్రీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here