నీకు ఓ బస్తా సన్నబియ్యం పంపుతాలే

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్న వేళ లాబీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నానికి ఎదురుపడ్డ మాజీ మంత్రి అచ్చన్న ఏం నాని నల్లబడ్డవ్ అంటూ వెటకారమాడారు. దీనికి స్పందించిన నాని మీలా రెస్ట్ లో లేం అందుకే నల్లబడ్డా’ అని వ్యంగ్యంగా జవాబిచ్చారు.
దీంతో అచ్చెన్నాయుడు ‘మీరు రేషన్ లో ఇస్తామంటున్న సన్నబియ్యం సంగతి తేలుస్తాం’ అని ఉడికించారు. పౌరసరఫరాల శాఖా మంత్రిగా ఉన్న కొడాలి నాని స్పందిస్తూ..’నువ్వు ఏమీ తేల్చలేవు. రేషన్ లో సన్నబియ్యం ఇచ్చి తీరుతాం. అవసరమైతే నీకూ సన్నబియ్యం బస్తా ఒకటి పంపుతా’ అని చెప్పడంతో అచ్చెన్నాయుడు నవ్వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here