డియర్ కామ్రేడ్ ట్రైలర్ టాక్

అర్జున్ రెడ్డి , గీతా గోవిందం సినిమాలతో విజయ్ దేవరకొండ యూత్ ఫేవరెట్ గా మారిపోయాడు. విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ట్రైలర్ విషయానికి వస్తే చైతన్య (విజయ్) కాలేజీలలో రాజకీయాలు ఎవరూ చేయకూడదని చెబుతూ గొడవలు పడుతూ ఉంటాడు. తనతో చిన్నప్పుడు కలిసి ఆడుకున్న లిల్లీ( రష్మికా మందన్న) తో పెద్దయ్యాక ప్రేమలో పడతాడు. కానీ గొడవల వల్ల విడిపోయిన ప్రేమికులు మూడేళ్ళ తరువాత కలిస్తే ఏం జరిగింది అనే కథాంశంతో సినిమా తీసారు.
ఈ సినిమా ట్రైలర్ విజయ్ ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా తీసాడా అనే విధంగా ఉంది. కొన్ని సీన్లలో విజయ్ అర్జున్ రెడ్డిలాగా రఫ్ ఆట్యిట్యూడ్తో, మరి కొన్ని సీన్లలో అమాయకంగా గీతా గోవిందం సినిమా హీరో పాత్రలా కనిపిస్తున్నాడు.
హీరోయిన్ రష్మికా మందన్నా స్టేట్ క్రికెట్ ప్లేయర్గా ఈ సినిమాలో కనిపించబోతూ ఉండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకుడు.
ఈ సినిమాలో డైలాగ్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘కామ్రేడ్ పోరాడితే అతనికి ఆ పోరాటం హాయినివ్వాలి స్వేచ్చనివ్వాలి కానీ నిన్ను చూస్తే నువ్వు అలా లేవు ‘, ‘వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్ళిపోయినప్పుడు ఎందుకు ఇంత బాధ పెడుతుంది ‘. ‘తోడుగా ఉంటానని చెప్పావ్ కానీ నిన్ను ఎప్పుడు ఎలా చూడాల్సి వస్తుందోనని భయమేస్తుంది ‘నన్ను భయపెడుతున్నానని అనుకుంటున్నారేమో మీరే భయపడుతున్నారు ‘ లాంటి డైలాగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఈ సినిమా జులై 26 వ తేదీన విడుదల కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here