`డియర్ కామ్రేడ్‌` వచ్చేశాడు!

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా మరోసారి కలిసి నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్‌`. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 26వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్‌తో కథ గురించి ముందే క్లారిటీ ఇచ్చారు. ఇష్టమైన దాని కోసం పోరాటం చేసే యువకుడిగా విజయ్ కనిపించాడు.

`వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది` అంటూ విజయ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అలాగే విజయ్‌, రష్మిక మధ్య లిప్‌లాక్ సీన్లను కూడా ట్రైలర్‌లో చూపించారు.

జస్టిన్‌ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. ఈ నెల 26న తెలుగుతోపాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here