చంద్రబాబుకు త్వరలో బిగ్ షాక్ ?

0
332

ఇపుడిదే విషయం తెలుగుదేశంపార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. గుంటూరు అరండల్ పేటలో 20 ఏళ్ళ క్రితం నిర్మించిన పార్టీ ఆఫీసునే ప్రస్తుతం స్టేట్ ఆఫీసుగా మార్చుకున్నారు. చంద్రబాబునాయుడు, లోకేష్ కూడా అక్కడే సమావేశాలు పెడుతున్నారు.
కరకట్ట మీదున్న అక్రమనిర్మాణాలపై పెద్ద ఎత్తున వివాదం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే గుంటూరులోని టిడిపి ఆఫీసు కూడా అక్రమనిర్మాణమే అన్న విషయం బయటపడింది. 1999లో మున్సిపల్ కార్పొరేషన్ స్ధలాన్ని లీజుకు తీసుకున్న టిడిపి ఆఫీసును కట్టింది.
అయితే కార్యాలయం నిర్మించేటపుడు పక్కనే ఉన్న మరో 1600 గజాల స్ధలాన్ని కూడా ఆక్రమించేసి పార్టీ కార్యాలయం కట్టేసినట్లు ఈమధ్య తెలిసింది.
అదే విషయంపై వైసిపి కార్పొరేటర్లు బుధవారం ఫిర్యాదు చేశారు. టిడిపి స్టేట్ ఆఫీసు అక్రమనిర్మాణం కాబట్టి తక్షణమే కూల్చివేయాలంటూ కార్పొరేటర్లు చేసిన ఫిర్యాదును అధికారులు కూడి సీరియస్ గా పరిశీలిస్తున్నారట.
కార్పొరేటర్ల ఫిర్యాదుపై చర్యలు తీసుకునే ముందు ఆ ఆఫీసు నిర్మాణాన్ని పరిశీలించాలని అధికారులు నిర్ణయించారట. రికార్డుల్లో ఉన్న వివరాలకు వాస్తవంగా పార్టీ కార్యాలయం నిర్మాణానికి బాగా తేడా ఉన్నట్లు సమాచారం. అదే సందర్భంగా కార్పొరేషన్ స్ధలాన్ని టిడిపి ఆక్రమించేసినట్లు చెబుతున్నారు. అంటే తొందరలోనే పార్టీ స్టేట్ ఆఫీసును కూల్చేసేందుకే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here