చంద్రబాబుగారు వచ్చుంటే బాగుండేది

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రశ్నోత్తరాల సమయంలో అనవసర విషయాలను చర్చలోకి లాగడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో చర్చించాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని, అందుకు తగ్గట్టు సమయపాలనతో సభను నడపించడానికి ఇరు పక్షాలూ సహకరించాలని కోరారు.
బుధవారం జరిగిన బీఏసీ సమావేశంలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామని గుర్తు చేశారు. ఆ సమావేశానికి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వచ్చుంటే బాగుండేదని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం నుంచి అచ్చెన్నాయుడు వచ్చారని, ఆయనకు స్పష్టంగా చెప్పామని స్పీకర్ అన్నారు.
ఏవైనా అభ్యంతరాలు ఉంటే పద్ధతి ప్రకారం రావాలని స్పీకర్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here