మంత్రి కన్నబాబుకు సోదర వియోగం

0
192

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు నివాసంలో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు సురేష్‌ విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి కన్నబాబుకు ఇద్దరు సోదరులు కాగా, సురేష్‌ పెద్ద తమ్ముడు. మరో సోదరుడు సినీ దర్శకుడు కళ్యాణ్‌. సురేష్‌ మృతదేహాన్ని కాకినాడకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్ సీపీ నేతలు కన్నబాబును ఫోన్‌లో పరామర్శించారు.

కన్నబాబు సోదరుడి హఠాన్మరణంపై సీఎం జగన్‌ సంతాపం
మంత్రి కన్నబాబు సోదరుడు సురేష్ హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కన్నబాబును ముఖ్యమంత్రి ఫోన్ ద్వారా పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here