కొత్త తరహాలో సాయి రామ్ శంకర్

0
101

స్టార్ డైరెక్టర్ తమ్ముడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మొట్టమొదటి సినిమాతోనే గుర్తింపు పొందారు సాయి రామ్ శంకర్ . దాని తరువాత బంపర్ ఆఫర్ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు . అయితే ఆ తరువాత నుండి సినిమాలలో ఎక్కువగా కనిపించలేదు . అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు . ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడు కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు . అమృత హరిణి క్రియేషన్స్ సురేష్ రెడ్డి , రియల్ రీల్స్ రాజారెడ్డి , శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు .

తలుపులమ్మ దేవస్థానంలో ఈ రోజు సినిమాను ప్రారంభించారు . తుని ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్ కొట్టగా, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ… తాను ఇంతవరకు నటించిన చిత్రాల్లోకి ఇది విభిన్న కథా చిత్రం అవుతుందని, తన కెరీర్ లో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని , తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందని అంటున్నారు హీరో సాయిరాం శంకర్. దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన క్రైమ్ సస్పెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకొని, ఆగస్టు నెల నుండి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పూరి కుటుంబానికి వైకాపాతో మంచి అనుబంధమే ఉంది . పూరి చాలా ఏళ్లుగా వైకాపా మద్దతుదారుడిగా ఉన్నారు . ఆయన తమ్ముడు ఉమా శంకర్ గణేష్ ఇటీవలి ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు . ఇప్పుడు సాయి రాబోయే సినిమాకి పూరి, సాయిరాం అభిమానులతో పాటు.. వైసీపీ అభిమానులు కూడా ఈ సినిమా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. తన ట్యాలెంట్ ని మరింతగా చూపించేందుకు, మరో సారి తెలుగు ఆడియన్స్ హృదయాల్లో గట్టి ముద్ర వేసేందుకు సిద్ధంగా మన ముందుకు వస్తున్నారు
సాయిరాం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here