రియల్ స్టార్ కొడుకు వచ్చేస్తున్నాడు

రియల్ స్టార్ శ్రీహరి..ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేమికుడు ఉండడు..విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఇలా ఎన్నో సినిమాలు చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన గొప్ప నటుడు. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే కాన్సర్ తో చనిపోయి అందర్నీ శోక సంద్రంలో పడేసాడు. ఇప్పుడు ఆయన లేని లోటును ఆయన కుమారుడు తీర్చబోతున్నాడు. శ్రీహరి కుమారుడు మేఘంష్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గత కొంతకాలంగా నటనలో శిక్షణ తీసుకున్న మేఘంష్ ఇప్పుడు ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా తో హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు కార్తీక్..
అర్జున్ అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారట. ఈ చిత్రానికి రాజ్ దూత్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. అతి త్వరలో షూటింగ్ మొదలు పెట్టి , సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను తెలియజేస్తారట. మరి మేఘంష్ హీరోగా ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here