కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. సేవ్ ఇండియా, సేవ్ డెమొక్రసీ పేరిట మమతా బెనర్జీ నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం కోల్కతా వెళ్లనున్నారు. అక్కడ మమతా బెనర్జీని కలిసి ఆమెకు సంఘీభావం తేలపనున్నారు.