మేమేంతా చంద్రబాబు వైపే…

0
124

నవ్యాంధ్రప్రదేశ్‌లో మాలలు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నారని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెంశివాజీ అన్నారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రంలో మాలమహానాడు జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం సామాజిక పింఛన్ల సొమ్మును రెట్టింపు చేసి పేద వర్గాలకు అండగా నిలవటం అభినందనీయమన్నారు. ఏపీలో సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు రికార్డు నెలకొల్పారని, సామాజిక ప్రయోజనాలు పొందుతున్న వారిలో దళిత, గిరిజనులకు చెందిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయన్నారు.

2019 ఎన్నికల్లో మాలమహానాడు కార్యకర్తలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో చంద్రబాబు బలపర్చిన అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని ఆయన మాలమహానాడు శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను దళిత, బలహీన వర్గాల నిరుద్యోగుల భవిష్యత్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌కు సాహసోపేతమైన నిర్ణయంతో చైర్మన్‌ హోదాలో నోటీసులు జారీచేశామని తెలిపారు. ఓపెన్‌ కేటగిరిలో దళిత, బలహీన వర్గాల వాటా కోసం చట్టబద్దంగా వ్యవహరించానని చెప్పారు. అమరావతిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనంలో 125 అడుగుల విగ్రహ నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here