టీమిండియాకు పీకల్లోతు కష్టాలు

0
131

హామిల్టన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, జార్ఖండ్ డైనమైట్ ధోనీల గైర్హాజరుతో ఆటను ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ 7 పరుగులకు, శిఖర్ ధావన్ 13 పరుగులకు పెవిలియన్ చేరి నిరుత్సాహపరిచారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న న్యూజిలాండ్ బౌలర్లలో వీరిద్దరి వికెట్లూ బౌల్ట్ కు చిక్కాయి. తొలుత శర్మను క్యాచ్ అండ్ బౌల్డ్ గా అవుట్ చేసిన బౌల్ట్, ఆపై ధావన్ ను ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కు పంపించాడు. ఆపై వచ్చిన అంబటి రాయుడు, కీపర్ దినేష్ కార్తీక్ లు గ్రాండ్ హోమ్ బౌలింగ్ లో డక్కౌట్ కావడంతో ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం శుభమన్ గిల్ 9, జాదవ్ 0 పరుగులతో క్రీజులో ఉండగా, భారత స్కోరు 11 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 33 పరుగులు మాత్రమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here