ఎన్టీఆర్ కు నివాళి…

0
177

టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సుహసిని, లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ. అన్నివర్గాల అభ్యున్నతికి పాటు పడిన పాటు మహనీయుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చేయూత నిచ్చి అధికారం కట్టబెట్టిన ఘనత తన తండ్రికి చెందుతుందని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన గుర్తుండిపోతారని చెప్పారు. తెలుగువారందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here