రామ్ చరణ్ కి కొత్త పేరు పెట్టిన ఉపాసన

రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. తమ కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని రామ్ఉపాసన సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటారు. తమ అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను, కుటుంబ సంగతులను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. తాజాగా ఉపాసన మరో మూమెంట్ ని షేర్ చేశారు.

తన భర్త రామ్‌చరణ్‌ నిజమైన హీరో అని అన్నారు. ‘వినయ విధేయ రామ’కోసం చరణ్‌ చాలా కసరత్తులు చేశారు. కాగా ఈ సినిమా సెట్‌లో తీసిన ఓ వీడియోను ఉపాసన ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో చరణ్‌ యాక్షన్‌ సన్నివేశానికి సిద్ధమౌతూ కనిపించారు. ‘కష్టమైన యాక్షన్‌ సీక్వెన్స్‌కు ముందు సెట్‌లో మై రాం-బో వర్కవుట్‌ చేశాడు.

అప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంది, కానీ ఆయన ఒంటిపై చొక్కా లేదు. మిస్టర్‌ సి నువ్వు నిజమైన హీరో.. ‘అని ట్వీట్ చేశారు.

 

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here