ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా?

0
150

దేశ ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా మీకు? నరేంద్రమోదీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయిన ఖర్చును విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వీ.కే. సింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జూన్ 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అయిన ఖర్చు అక్షరాల రూ. 2,021 కోట్లు. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెన్స్, హాట్ లైన్ సౌకర్యం వంటి తదితరాలకు ఈ మొత్తం ఖర్చు అయినట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014లో 30,930.5 మిలియన్ల డాలర్లు కాగా అది 2017లో 43478.27 మిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు. విదేశీ పర్యటనల్లో భాగంగా ప్రధాని ఇప్పటి వరకు 55 దేశాలను సందర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here