కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. జడ్చర్ల నుంచి కొడంగల్‌లోని ఆయన నివాసానికి తీసుకెళుతున్నారు.రేవంత్ రెడ్డిని విడుదల చేశామని కోర్టుకు తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బి శివానంద ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో ఏజీ వాంగ్మూలాన్ని హైకోర్టు రికార్డు చేసింది. రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం.. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.కాగా, రేవంత్ రెడ్డి అరెస్టుకు గల కారణాలను రేపు వివరిస్తామని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణ 5వ తేదీ బుధవారానికి వాయిదా పడింది.