నేడే టిడిపి ధర్మ పోరాట దీక్ష

విజయనగరంలో మంగళవారం చేపట్టే టిడిపి ధర్మ పోరాట దీక్షకు పట్టణం ముస్తాబైంది. సిఎం హెలికాప్టర్‌ దిగే పోలీస్‌ శిక్షణ కళాశాల నుంచి అశోక్‌ బంగ్లా, కాంప్లెక్స్‌, కోట, అయోధ్య మైదానం వరకు టిడిపి జెండాలు, బ్యానర్లు, తోరణాలతో నింపేశారు. ఎలాగైనా అధినేత దృష్టిలో పడాలన్న లక్ష్యంతో జిల్లా నాయకులు పోటా పోటీ ఏర్పాట్లు చేశారు. సభాస్థలి మొత్తం పసుపు వర్ణంతో ముంచేశారు. ఎక్కడికక్కడ భారీగా జనరేటర్లు, లైటింగ్‌ ఏర్పాటు చేశారు. సిఎం కాన్వాయ్‌ మార్గంలో సోమవారం రెండు సార్లు ట్రయల్‌ రన్‌ కూడా చేశారు. అయితే ఈ ఎఫెక్ట్‌ ఏ మాత్రం అధినేతను మెప్పిస్తుందో మంగళవారం దీక్ష ముగిసే వరకు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here