దీపావళి పండుగను పురస్కరించుకుని విక్రయించే బాణసంచాకు సంబంధించి ప్రభుత్వం అనుమతించిన వాటి కోసం సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని జిల్లాధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీపావళి పండుగ సందర్భంగా పేల్చే బాణసంచాపై సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు విధించిన నేపధ్యంలో అనుమతి ఉన్న బాణసంచాలు తప్పా భారీ పేలుడు కలిగిన బాణసంచాలను విక్రయించేవారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.అదే సమయంలో సుప్రీంకోర్టు నిషేధించిన బాణసంచాలు పేల్చేవారిపై కూడా చట్టపరంగా తీసుకుంటామన్నారు. ఇలాంటి నిషేధిత బాణసంచా పేల్చిన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని పోలీస్‌ అధికారులను బాధ్యులుగా చేసేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని వీటిని ప్రతిఒక్కరు గుర్తించుకుని నిబంధనలకు లోబడి బాణసంచను ఉపయోగించాలని సూచించారు. పండుగ సందర్భంగా 5 నుంచి 8వ తేదీవరకు రాత్రి 8గంటల నుంచి 10గంటల వరకు కేవలం రెండు గంటలు మాత్రమే బాణసంచా పేల్చాల్సి ఉంటుందని నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here