అంబటి రాయుడు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్టు అన్ని పత్రికలూ కథనం ప్రచురించాయి. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లపై దృష్టి పెట్టేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు హెచ్‌సీఏ ఒక ప్రకటన విడుదల చేసిందని తెలిపాయి.’టీమిండియా వన్డే బ్యాట్స్‌మన్, హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు ఒకింత ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడు. టి20, వన్డే ఫార్మాట్‌లపై మరింత దృష్టి పెట్టేందుకు… ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు..’ అని తెలిపాయి.ఇటీవలే జాతీయ జట్టులోకి పునరాగమనం చేసి, చక్కటి ఆటతీరుతో స్థానం సుస్థిరం చేసుకుంటున్న 33 ఏళ్ల రాయుడు ఫిట్‌నెస్‌ను కాపాడుకునే ఉద్దేశంలోనే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోందని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here