తెలంగాణ బాహుబలి అయిన కేసీఆర్‌ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని కడియం శ్రీహరి అన్నారు. మహబూబాబాద్‌ ఎన్టీఆర్‌ మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా..తెరాసలాగా సంక్షేమకార్యక్రమాలు చేపట్టిందా ?అని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి రాకముందు..ఆడపిల్ల తల్లిదండ్రులు గుండెలపైన కుంపటిగా భావించేవారని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో ఎందరో ఆడపడుచుల జీవితాలు బాగుపడ్డాయన్నారు. పేదప్రజల సంక్షేమం కోసం కృషి చేసే వ్యక్తి కేసీఆర్‌ అని అన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేకే ప్రతిపక్షాలు మహాకూటమిగా వస్తున్నాయని..అది మహాకూటమి కాదు..దగా కూటమి అని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here