రేవంత్‌ ఇంట్లో రూ.కోటి నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

0
167

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి ఇంట్లో రూ. కోటి నగదు, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రేవంత్ ఇంట్లో ఐటీశాఖకు చెందిన మరో అధికారుల బృందం శనివారం కూడా సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. కాగా… ఓటుకు నోటు కేసుతో సంబంధమున్న సెబాస్టియన్, ఉదయ్‌సింహ ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం సెబాస్టియన్‌కి నోటీసులు ఇచ్చారు. సోమవారం లోపు సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here