ఇంట్లో దాక్కుని తిరిగా అప్పుడు

0
130

అభిమానుల కోరికను ఇప్పటికి నెరవేర్చాడు మంచు మనోజ్. అభిమానులు చాలా రోజులుగా నీ నెక్ట్స సినిమా ఏంటో చెప్పు అని చాలా రోజులుగా అడుగుతున్నా మనోజ్ ఆ విషయంపై పెద్దగా స్పందించలేదు. ఇటీవల ఓ అభిమాని సరదాగా ‘అలా తిరగకపోతే ఏదైనా సినిమా చేసుకోరాదు అన్న’ అంటే దీనికి కూడా నవ్వేసి ఊరుకున్నాడు.తాజాగా ఆపరేషన్ 2019 కథ విన్న మనోనజ్ ”పెదరాయుడు’లో రజనీకాంత్‌గారి పాత్రలా ఉంది. సూపర్‌.. నేను చేస్తున్నా” అన్నాడని ఆ సినిమా డైరెక్టర్ కరణం బాబ్జి తెలిపారు. తాజాగా మనోజ్ నటించిన ఓ మూవీలో సీన్‌ని ట్విటర్‌లో పోస్ట్ చేసిన అభిమాని ‘మూవీ సీన్ సూపర్’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి మనోజ్ ”అప్పుడు నా చెవి కాలిపోయింది. ఇంట్లో దాక్కొని తిరిగా” అని రీ ట్వీట్ చేశాడు. ‘అంత రిస్క్ చేయడం ఎందుకు భయ్యా’ అని మరో అభిమాని అడిగితే ‘కూటికి కోటి విద్యలు’ అని రిప్లై ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here