విజయ్ దేవరకొండ కోసం చిరు..

0
135

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో చెప్పాల్సిన పని లేదు..ముఖ్యంగా యూత్ అయితే విజయ్ కు వీరాభిమానులయ్యారు. ప్రస్తుతం విజయ్ నటించిన గీత గోవిందం చిత్రం ఈ నెల 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సోలో ఫేమ్ పరుశురాం డైరెక్ట్ చేసిన ఈ మూవీ ని బన్నీ వాసు నిర్మించారు. ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇప్పటికే మార్కెట్లో ఈ చిత్ర గీతాలకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించే యోచనలో టీమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈవెంట్‌కు గెస్ట్‌గా మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు సమాచారం. చిరంజీవి రాక విషయం తెలియగానే విజయ్‌ ఎంతో ఎగ్జైట్‌ అయినట్లు తెలుస్తోంది.దీనిపై అధికారిక ప్రటకన రావాల్సి ఉంది. గతం లో ఈ చిత్ర ఆడియో వేడుకకు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. విజయ్‌-రష్మిక మందన్న జంటగా రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి గోపీ సుందర్‌ మ్యూజిక్‌ అందిచగా.. గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్‌పై చిత్రం విడుదల కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here